ఏపీకి బిగ్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

by Disha Web Desk 10 |
ఏపీకి బిగ్ అలర్ట్..ఈ  జిల్లాల్లో భారీ  వర్షాలు
X

దిశ,వెబ్ డెస్క్ : ఏపీలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈనెల 19వ తేదీకి బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. మరో 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. నేడు శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తెలిపాటి వర్షం పడే అవకాశం ఉందంటున్నారు. మరో వైపురాష్ట్రంలో ఎండతీవ్రత ఎక్కువైంది.

Next Story