సీఎం వైఎస్ జగన్‌తో భూమన కరుణాకర్ రెడ్డి భేటీ

by Seetharam |
సీఎం వైఎస్ జగన్‌తో భూమన కరుణాకర్ రెడ్డి భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను టీటీడీ నూతన చైర్మన్‌‌గా నియమితులైన భూమన కరుణాకర్‌ రెడ్డి బుధవారం కలిశారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో తనయుడు అభినయ్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. టీటీడీ చైర్మన్‌గా తనకు అవకాశం కల్పించిన సీఎంకు భూమన కృతజ్ఞతలు తెలిపారు. ఇకపోతే గురువారం ఉదయం తిరుమలలో టీటీడీ చైర్మన్‌‌గా భూమన కరుణాకర్‌‌రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా వైఎస్‌ జగన్ ఆశీస్సులు తీసుకునేందుకు భూమన కరుణాకర్ రెడ్డి సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. ఇకపోతే గతంలోనే టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి పనిచేశారు. వైఎస్ఆర్ హయాంలో 2006-2008 మధ్య టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం భూమన తిరుపతి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అంతేకాదు పాలకమండలి సభ్యుడిగా కూడా ఉన్నారు. అయితే టీటీడీ పాలకమండలి పదవీకాలం నేటితో ముగియనున్న నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డిని కొత్త టీటీడీ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Next Story

Most Viewed