మూడే మూడు నెలలు ఓపిక పట్టండి..వచ్చేది మన ప్రభుత్వమే: నారా లోకేశ్

by Seetharam |
మూడే మూడు నెలలు ఓపిక పట్టండి..వచ్చేది మన ప్రభుత్వమే: నారా లోకేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ‘మూడే మూడు నెలలు ఓపిక పట్టండి. మన ప్రభుత్వం ఏర్పడబోతుంది’అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర ఆదివారం కొనసాగుతుంది. ఈ సందర్భంగా లోకేశ్ శృంగవృక్షంలో కాకినాడ సెజ్ రైతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి నారా లోకేశ్ మాట్లాడారు. మరో మూడు నెలల్లో ప్రజల ప్రభుత్వం ఏర్పడబోతోందని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి మళ్లీ పరిశ్రమలను తీసుకువస్తామని...పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుడతామని మామీ ఇచ్చారు. తెలుగుదేశం హయాంలో రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందని చెప్పుకొచ్చారు. కియా పరిశ్రమను తీసుకువచ్చామని.. ఈ పరిశ్రమ వల్ల వేలాది మంది జీవితాలు మారిపోయాయని నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. అంతేకాదు తాను ఐటీ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు రాష్ట్రానికి ఫోన్‌ పరిశ్రమను సైతం తీసుకువచ్చినట్లు వెల్లడించారు. టీడీపీ హయాంలో వచ్చిన కంపెనీల వల్ల వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని చెప్పుకొచ్చారు. టీడీపీ హయాంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు తరలివస్తే... ఈ ప్రభుత్వ హయాంలో మాత్రం కంపెనీలు రాష్ట్రం నుంచి పరారైపోతున్నాయని నారా లోకేశ్ చెప్పుకొచ్చారు.Next Story

Most Viewed