వైసీపీ బిగ్ స్కెచ్.. బాలకృష్ణపై పోటీగా బీసీ మహిళను రంగలోకి దింపుతోన్న జగన్..!

by Disha Web Desk 19 |
వైసీపీ బిగ్ స్కెచ్.. బాలకృష్ణపై పోటీగా బీసీ మహిళను రంగలోకి దింపుతోన్న జగన్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హీట్ రాజుకుంది. ఎలక్షన్లకు మరో మూడు నెలల సమయం ఉండగానే.. నేతలు ఇప్పటి నుండే విమర్శల బాణాలు ఎక్కుపెట్టుకుంటున్నారు. అధికార వైసీపీ, టీడీపీ, జనసేన నేతల విమర్శలతో ఏపీ పొలిటికల్ వెదర్ వేడెక్కింది. ఈ క్రమంలో టీడీపీ కీలక నేత, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హిందుపురం ఒక అద్దాల మేడ అని.. చిన్న రాయి వేసిన పగులుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై పోటీగా వైసీపీ నుండి ఈ సారి బీసీ మహిళను బరిలోకి దింపుతున్నామని పెద్దిరెడ్డి ప్రకటించారు. ఈ సారి హిందుపురంలో బాలకృష్ణ వర్సెస్ బీసీ మహిళ పోరు ఉంటుందని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతలకు ఓట్లు అడిగే హక్కు లేదని విమర్శించారు.

కాగా, టీడీపీ కంచుకోట అయిన హిందుపురంలో ఈ సారి ఎలాగైనా జెండా పాతాలని వైసీపీ మొదటి నుండి పక్కా ప్రణాళిక ప్రకారం అధికార పార్టీ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే హిందుపురం నియోజకవర్గంలో అత్యధింగా బీసీ సామాజిక వర్గ ఓటర్లు ఉండటంతో.. అదే వర్గానికి చెందిన మహిళను బరిలోకి దింపి టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టాలని ప్లాన్ చేస్తోంది. గత రెండు పర్యాయాలు హిందుపురం ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్యపై.. బీసీ మహిళ కార్డు ప్రయోగించి చెక్ పెట్టాలని వైసీపీ యోచిస్తోంది. వైసీపీ ప్లాన్ వర్కౌట్ అయితే.. ఈ సారి హిందుపురంలో బాలయ్యకు తిప్పలు తప్పేలా లేవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక, బాలయ్యపై పోటీగా వైసీపీ నుండి హిందుపురం నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ టీ. దీపికను బరిలోకి దింపనున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed