తల్లిదండ్రుల సాక్షిగా 2 సెంట్ల స్థలం ఇస్తా: మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి

by Disha Web Desk 16 |
తల్లిదండ్రుల సాక్షిగా 2 సెంట్ల స్థలం ఇస్తా: మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: మరో నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు ఉండటంతో రాజకీయ నేతలు ఎమ్మెల్యేగా గెలిచేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటివరకూ చేయలేని పనులను సైతం చేస్తామంటూ ఊదరగొడుతున్నారు. అంతేకాదు తల్లిదండ్రులపై ఒట్టేసి మరీ హామీలు ఇస్తున్నారు. ఈ కోవలోకి తాజాగా బనగాన పల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి చేరిపోయారు.

నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం కొండపేటలో అసంపూర్తిగా ఉన్న మసీద్‌ను సొంత డబ్బులతో నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల హామీ ఇచ్చారు. బనగానపల్లెలోని పేదలకు తన సొంత డబ్బులతో 2 సెంట్ల స్థలం కొని ఇస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు తన తల్లిదండ్రుల సాక్షిగా మాట ఇస్తున్నాని ప్రజలకు చెప్పారు. కొందరు కావాలనే తనపై, తన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ ఆరోపణలు చేస్తున్న వారిని ఆ దేవుడే చూసుకుంటారని బీసీ జనార్దన్ రెడ్డి శపించారు.


Next Story

Most Viewed