టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడి..ముగ్గురి అరెస్ట్

by Jakkula Mamatha |
టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడి..ముగ్గురి అరెస్ట్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో గత వైసీపీ హయాంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021 అక్టోబర్ 19వ తేదీన పలువురు వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడి కేసులో గుంటూరు, విజయవాడకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటన పై ప్రస్తుతం టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో సీసీ ఫుటేజీ ద్వారా పలువురు వైసీపీ నేతలను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడి కేసులో పోలీసులు మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు సమాచారం. విజయవాడ కృష్ణలంకకు చెందిన పవన్ కుమార్, భాగ్యరాజ్, సుధాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు మంగళగిరి గ్రామీణ పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరికొందరిని అతి త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.Next Story

Most Viewed