- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Atchennaidu: టెక్కలిలో మంత్రి అచ్చెన్న పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఇవాళ తన సొంత నియోజకవర్గమైన టెక్కలిలో పర్యటించిన ఏపీ వ్యవసాయ శాఖమంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా టెక్కలి జిల్లా ఆసుపత్రిని సందర్శించిన ఆయన ఆసుపత్రి ఏరియాను పరిశీలించి ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యసేవలు సక్రమంగా అందించాలని, రోగుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం ఆసుపత్రిలో లిఫ్ట్ పనిచేయట్లేదని తెలుసుకొని, తక్షణమే లిఫ్ట్ మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
అలాగే టెక్కలి జిల్లా ఆసుపత్రి వెనుక భాగంలో మార్చురీ నిర్మాణంతో పాటు బయో వేస్టేజ్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు తగు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అంతేగాక టెక్కలి రహదారులపై గోవులు ఎక్కువగా తిరుగుతుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాటి రక్షణ కోసం గోశాల నిర్మించాలని చెప్పారు. అందుకు తగిన స్థలాన్ని పరిశీలించి, గోశాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం టెక్కలి గ్రామంలో పర్యటించిన ఆయన.. గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఇంటి పన్నులు, డ్రింకింగ్ వాటర్ సమస్యల పరిష్కారం, పశువుల సంచారం లేకుండా చర్యలు, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ, పారిశుధ్య కార్మికుల సమస్యలు తదితర అంశాలపై అధికారులతో చర్చలు జరిపారు. గ్రామంలో ఇతర సమస్యలపై అధికారులు ఎప్పటికప్పుడు ఆరా తీయాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే ప్రజల సమస్యలపై వినతీపత్రాలు స్వీకరించారు. అంతేగాక వరదల వల్ల వ్యవసాయం తీవ్రంగా దెబ్బతిందని, యాప్ ద్వారా అన్ని వివరాలు సేకరించామని, నష్టపోయిన ప్రతి ఒక్కరికీ పరిహారం అందుతుందని స్పష్టం చేశారు. జగన్ కు పాలన మీదే కాదు.. వ్యవసాయం మీద కూడా అవగాహాన లేదని, అందుకే ఐదేళ్ల పాలనలో పంటల భీమా ఇవ్వలేదని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు.