తెలంగాణలో కాంగ్రెస్‌ ముందంజ .. ఏపీలో సంబురాలు

by Disha Web Desk 16 |
తెలంగాణలో కాంగ్రెస్‌ ముందంజ .. ఏపీలో సంబురాలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయంవైపు దూసుకుపోతోంది. 119 స్థానాల్లో 61 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. బీఆర్ఎస్ 41, బీజేపీ-8, ఎంఐఎం-3, ఇతరులు -1 స్థానంలో అధిక్యంలో ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయపథంలో దూసుకుపోవడంతో అటు ఏపీ కాంగ్రెస్‌లో సంబురాలు అంబరాన్నంటాయి. విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో సంబురాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఖాయమని, వచ్చే ఎన్నికల్లో ఏపీలో కూడా సత్తాచాటుతామని ధీమా వ్యక్తం చేశారు.Next Story