ఏపీలో ఫ్రీ బస్సు జర్నీ .. వారికి మాత్రమే..!

by Disha Web Desk 16 |
ఏపీలో  ఫ్రీ బస్సు జర్నీ .. వారికి మాత్రమే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో టెస్త్, ఇంటర్, ఒకేషనల్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పరీక్షలు జరిగినన్నీ రోజులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించారు. విద్యార్థులు హాల్ టికెట్లు చూపించి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ తెలిపారు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సదుపాయం కల్పిస్తు్న్నట్లు వెల్లడించారు.

కాగా టెన్త్ పరీక్షలు మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9:30నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి ఒకటి నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక ఒకేషనల్ ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి నెల 18 నుంచి 30వ తేదీ వరకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరగనున్నాయి. ఇన్విజిలేటర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్‌లు, కస్టోడియన్స్, సిట్టింగ్ స్క్వాడ్ టీమ్‌లతో పర్యవేక్షించనున్నారు.


Next Story

Most Viewed