Srikakulam:శ్రీకాకుళం ఘటన పై స్పందించిన ఏపీ పోలీసులు

by Jakkula Mamatha |
Srikakulam:శ్రీకాకుళం ఘటన పై స్పందించిన ఏపీ పోలీసులు
X

దిశ,వెబ్‌డెస్క్: శ్రీకాకుళంలోని ఇండియన్ ఆర్మీ(Indian Army) ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌(Private Coaching Centre)లో విద్యార్థులను హింసించిన ఘటన పై చర్యలు తీసుకోవాలని పోలీసులను మంత్రి లోకేష్(Minister Nara Lokesh) ఆదేశించారు. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి దగ్గర సుమారు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేసి బాధితులకు నరకం చూపిస్తోందని.. తాజాగా తమకు జాబ్ ఎప్పుడు ఇప్పిస్తారని ప్రశ్నించిన ఓ యువకుడిపై ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ ఫౌండర్ బసవ రమణ విచక్షణరహితంగా దాడికి దిగాడు.

ఓ ప్లాస్టిక్ వైర్‌ను చేతిలో పట్టుకుని సదరు యువకుడిని గొడ్డులా బాదాడు. అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడయాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై మంత్రి లోకేష్ స్పందింస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు ఈ ఘటన 2023, డిసెంబర్‌లో జరిగిందని తెలిపారు. వీడియోలోని స్టూడెంట్‌ను గుర్తించమని, అతని వాంగ్మూలం నమోదు చేసేందుకు ఒక టీమ్‌ను పంపినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed