Ap News: ఐఏఎస్ అధికారుల బదిలీ.. ఉత్తర్వుల జారీ

by Disha Web Desk 16 |
Ap News: ఐఏఎస్ అధికారుల బదిలీ.. ఉత్తర్వుల జారీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా జేసీగా ఆర్‌.గోవిందరావు, అన్నమయ్య జిల్లా జేసీగా పర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ను ప్రభుత్వం నియమించింది. అలాగే వెనుకబడిన తరగతుల ఆర్థిక కార్పొరేషన్‌కు వీసీ, ఎండీగా క్రైస్ట్‌ కిశోర్‌, ఏపీ భవన్‌ అదనపు రెసిడెంట్‌ కమిషనర్‌గా హిమాన్షు కౌశిక్‌, కర్నూలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా ఎ.భర్వత్‌ తేజను ప్రభుత్వం నియమించింది. ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డిపార్టుమెంట్‌ డైరెక్టర్‌గా వి.ఆంజనేయులు, స్వామిత్వ స్పెషల్‌ కమిషనర్‌గా ఎ.సిరి, ఆయుష్‌ కమిషనర్‌గా ఎస్‌.బి.ఆర్‌.కుమార్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

Also Read..

AP BJP: ఏపీ రాజకీయాల్లో కొత్త టర్న్.. ఆ పార్టీతో చెలిమి కట్!

Next Story