మద్యం ప్రియులకు భారీ గుడ్ న్యూస్.. రూ.80లకే లిక్కర్ బాటిల్

by Bhoopathi Nagaiah |
మద్యం ప్రియులకు భారీ గుడ్ న్యూస్.. రూ.80లకే లిక్కర్ బాటిల్
X

దిశ, వెబ్‌డెస్క్: మద్యం ప్రియులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు ఆకాశానంటిన ధరలను దించుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఒకటి, రెండు వారాల్లో సవరించిన ధరలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు తక్కువ ధరలో ఉన్న కేటగిరి మద్యం బాటిళ్ల క్వాటర్ ధర రూ.200 పైచిలుకు ఉన్నది. వీటినే రూ.80 నుంచి 90 రూపాయల వరకు అందించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల NMC బ్రాండ్లపై ఈ తక్కువ ధరలను అమలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కొత్త మద్యం పాలసీపై లిక్కర్ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. ధర తగ్గినా.. మద్యం నాణ్యత తగ్గకుండా ఉండేలా చర్యలు తీసుకుంటుంది.

మరోవైపు ఏపీ ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ అమలవుతున్న మద్యం పాలసీ, ధర, నాణ్యత, సేల్స్ ఇలా వివిధ అంశాలపై అధ్యయనం చేసింది. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. వీటన్నీటి నేపథ్యంలోనే NMC బ్రాండ్లపై ధరలు తగ్గించడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి తగ్గిన ధరలు మద్యం ప్రియులకు అందుబాటులోకి రానున్నాయి.



Next Story

Most Viewed