- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మద్యంపై మాదకద్రవ్యాల నియంత్రణ సుంకం వసూలు
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గత ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీ ని రద్దు చేసి. దాని స్థానంలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. కాగా దీనికి సంబంధించి.. రాష్ట్రంలో రెండేళ్ల కాల పరిమితితో నూతన మద్యం విధానాన్ని ప్రకటించారు. 2024 అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది. మొత్తం 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలవ్వగా.. ఈ నెల 11న లాటరీ పద్ధతి ద్వారా లైసెన్సులు ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే.. మద్యం పై మాదకద్రవ్యాల నియంత్రణ సుంకం వసూలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా వచ్చే వంద కోట్లు.. డ్రగ్స్ నియంత్రణకు వినియోగించేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా.. మద్యం వ్యసన విముక్తి, కౌన్సిలింగ్ కేంద్రాల ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది.. గతంలో మద్యం పై పది రకాల పన్నులు వసూలు చేయగా.. కొత్త మద్యం పాలసీ ప్రకారం.. ప్రస్తుతం మద్యం పై ఆరు రకాల పన్నులు వసూలు చేస్తున్నారు.