ఎన్నికల వేళ సెంటిమెంట్ నినాదం.. చంద్రబాబు నోట కీలక ప్రకటన

by Disha Web Desk 16 |
ఎన్నికల వేళ సెంటిమెంట్ నినాదం.. చంద్రబాబు నోట కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: గత ఎన్నికలకు ముందు ఏపీలో బీజేపీని టీడీపీ విభేదించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేతో కలిసి వెళ్తోంది. అయితే గత ఎన్నికల ముందు జరిగిన ఓ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి గుర్తు చేశారు. స్పెషన్ స్టేటస్ అనేది ఆంధ్రుల సెంటిమెంట్ అని, అది అడిగితే బీజేపీ ఇవ్వలేదని, అందుకే తాను డిఫర్ అయ్యానని చెప్పారు. ఆ ఒక్కటి తప్ప బీజేపీతో తనకు ఎక్కడా అభిప్రాయ బేధాలు రాలేదని తెలిపారు. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్‌తో పాటు విభజన హామీలు అడుతున్నామని తెలిపారు. బీజేపీని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏ విధంగా పరిష్కారం చూపుతారో చూడాలని చంద్రబాబు పేర్కొన్నారు.

ఇక అమరావతి రాజధానిపైనా ఆయన సంచలన వ్యా్ఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతినే అని బీజేపీ కూడా చెబుతోందన్నారు. అమరావతి రైతలు కోసం అప్పటి కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ 10 ఏళ్ల పాటు Capital gains exemption ఇచ్చారని గుర్తు చేశారు. తమ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే పోలవరం పనులు జరిగాయని, కానీ వైసీపీ వద్దని చెప్పిందని తెలిపారు. ప్రాక్టికల్ ఏమేమి సాధ్యమవుతాయో రాష్ట్రంలో ఉండే మేధావులంతా ఆలోచించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Read More..

‘ది లీడర్ రిటర్న్స్’ అంటూ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం..పక్కా వ్యూహంతో ప్రచారం

వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదలకు ముహూర్తం ఫిక్స్.. అక్కడి నుంచే ప్రకటన


Next Story

Most Viewed