- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
18న ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఎందుకంటే..!

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు(Ap Cm Chandrababu) ఈ నెల 18న ఢిల్లీ(Delhi) వెళ్లనున్నారు. ప్రధాని మోదీ(Pm Modi)తో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. అమరావతి(Amaravati) పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. అమరావతికి ప్రపంచబ్యాంక్ నిధులతో పాటు పలు అంశాలపై ప్రధానితో చర్చించనున్నట్లు టీడీపీ(Tdp) వర్గాలు చెబుతున్నాయి.
కాగా ఏపీ అమరావతి రాజధాని అభివృద్ధిపై ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు రెండు ప్రతిష్టాత్మకమైన బ్యాంకులతో పాటు హడ్కో కూడా రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. దీంతో త్వరలో నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు టెండర్ల ప్రక్రియను కూడా దాదాపుగా పూర్తి చేశారు. అమరావతి నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా రోడ్లు, ల్యాడ్ ఫూలింగ్, నిర్మాణాలు, ప్లాట్ల అభివృద్ధి, హైవేకు కనెక్టివిటీ వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇక పనులు ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు. అయితే ప్రధాని మోడీతో రాజధాని పున:పనులను ప్రారంభించాలని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు హస్తినకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు టీడీపీ ఎంపీ అన్ని ఏర్పాట్లు సమాచారం.