AP: ఒంటరిగా జగన్‌ను ఢీకొట్టే సత్తా చంద్రబాబుకు లేదు: సజ్జల రామకృష్ణా రెడ్డి హాట్ కామెంట్స్

by Disha Web Desk 1 |
AP: ఒంటరిగా జగన్‌ను ఢీకొట్టే సత్తా చంద్రబాబుకు లేదు: సజ్జల రామకృష్ణా రెడ్డి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఒంటరిగా జగన్‌ను ఢీకొట్టే సత్తా చంద్రబాబుకు లేదని వైఎస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆరోపించారు. ఆయన అసమర్ధ పాలనతో రాష్ట్రాన్ని పూర్తిగా అధకారంలోకి నెట్టారని తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ టీడీపీ నేతలకు సైతం బీజేపీ కండువాలు కప్పి టికెట్లను ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. జనసేనకు కేటాయించిన సిట్లలోనూ టీడీపీ నేతలను పోటీలో దించారని తెలిపారు. పొత్తు అని చెప్పి చంద్రబాలు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నా.. బీజేపీ, జనసేన నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో ఇలాంటి తెర చాటు రాజకీయాలు తానెప్పుడూ చూడలేదని ధ్వజమెత్తారు.

చివరికి పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ స్థానంలో మరో టీడీపీ నేతను పోటీలో పెడతారేమోనని సెటైర్లు వేశారు. ఏది ఏమైనా ఒంటరిగా జగన్‌ను ఢీకొట్టే సత్తా చంద్రబాబుకు లేదని, అసలు ఆ పార్టీ ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. బాబు జనాల్లోంచి అధికారంలోకి రాలేదని, ఏకంగా పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి పరిస్థితి చూస్తే.. కుక్కలు చించిన విస్తరిలా ఉందని అన్నారు. టీడీపీలో కేవలం తండ్రీకొడుకుల రాజకీయం నడుస్తోందని అన్నారు. తమ్ముడి మీద ప్రేమతో కూటమి అధికారంలోకి రావాలని చిరంజీవి కోరుకుంటున్నారని, అయితే బ్యాంకులను మోసం చేసిన సీఎం రమేష్‌కు మద్దతు ఇస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. చంద్రబాబు డ్రామాలో షర్మిలది కూడా ఓ పాత్ర అని అన్నారు. అందుకే తెలంగాణ ప్రజలు ఆమెను ఏపీకి పంపిచారని సజ్జల ఆరోపించారు.



Next Story

Most Viewed