సర్కార్ కీలక నిర్ణయం.. ఇక నుంచి ప్రజలు చెప్పిందే ఫైనల్

by Gantepaka Srikanth |
సర్కార్ కీలక నిర్ణయం.. ఇక నుంచి ప్రజలు చెప్పిందే ఫైనల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పథకాలు, పౌర సేవలపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని నిర్ణయించింది. నిరంతర ఫీడ్ బ్యాక్ ఆధారంగా సేవలు కొనసాగించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu ) ఆదేశాలు జారీ చేశారు. మెరుగైన సేవల కోసం లబ్ధిదారుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టాలని సూచించారు. ఐవీఆర్ఎస్ విధానాన్ని ఉపయోగించాలని ఆదేశించారు. ఇక నుంచి ప్రజలు చెప్పిందే ఫైనల్ కావాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు ఈనెల 3వ తేదీన ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం జరపాలని నిర్ణయించారు. ఆదివారం సాయంత్రంలోపు ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖల కార్యదర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సర్క్యూలర్ జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed