జనసేనా పార్టీలో చేరనున్న అనసూయ..! క్లారిటీ ఇచ్చిన యాంకరమ్మ

by sudharani |
జనసేనా పార్టీలో చేరనున్న అనసూయ..! క్లారిటీ ఇచ్చిన యాంకరమ్మ
X

దిశ, సినిమా: బుల్లితెర యాంకర్‌గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన అనసూయ.. ప్రస్తుతం వెండితెరపై కూడా దూసుకుపోతోంది. రామ్ చరణ్ ‘రంగస్థలం’ మూవీలో రంగమ్మత్త క్యారెక్టర్‌తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న అనసూయ.. రీసెంట్‌గా వచ్చిన ‘రజాకార్’ మూవీతో కూడా తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ప్రజెంట్ అల్లు అర్జున్ ‘పుష్ప-2’ సినిమాతో బిజీగా ఉన్న ఈ యాంకరమ్మ.. జనసేన పార్టీలో చేరబోతుందంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించింది వైరల్ కామెంట్స్ చేసింది అను.

ఆమె మాట్లాడుతూ.. ‘నేను ఏం చేసిన అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. తుమ్మిన, దగ్గిన అది కాంట్రవర్సీకి దారితీస్తుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు అక్కడ రాజకీయాలపై అడిగిన ప్రశ్నలకు మాత్రమే నేను సమాధానం ఇచ్చాను. నాయకుడు నచ్చి, అతడి అజెండా నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేస్తాను అని చెప్పాను. ‘జనసేన’ పార్టీ’ అజెండా నాకెంతో నచ్చింది. అంతే కానీ పార్టీలో చేరతానని, ప్రచారాలకు వెళ్తానని చెప్పలేదు’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అనసూయ కామెంట్స్ మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read More..

TDP లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదలNext Story

Most Viewed