Anantapur: వైసీపీ కీలక నేత రాజీనామా.. జగన్‌కు లేఖ

by srinivas |   ( Updated:2022-11-08 15:47:48.0  )
Anantapur: వైసీపీ కీలక నేత రాజీనామా.. జగన్‌కు లేఖ
X

దిశ వెబ్ డెస్క్: అనంతపురం (Anantapur) వైసీపీ (Ycp) కీలక నేత రాజీనామా చేశారు. జిల్లా అధ్యక్ష పదవికి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి (Mla Kapu Ramachandra Reddy) రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌ (Cm Jagan)కు లేఖ రాశారు. తమ కుటుంబంలో చోటు చేసుకున్న విషాదంతో పాటు రాయదుర్గం (Rayadurgam) నియోజకవర్గంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి వస్తోందని.. అందువల్ల జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని కాపు రామచంద్రారెడ్డి లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు జిల్లా అధ్యక్ష పదవికి మరొకరిని నియమించాలని సూచించారు.

కాగా కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ్ రెడ్డి గత ఏడాది ఆగస్టులో ఆత్మహత్య చేసుకున్నారు. మంజునాథ్ రెడ్డి భార్య, కాపు రామచంద్రారెడ్డి కుమార్తె స్రవంతి డాక్టర్. మంజునాథరెడ్డి స్వగ్రామం అన్నమయ్య జిల్లా పప్పిరెడ్డిగారి పల్లె.. ఏమైందో ఏమో గాని కాపు రామచంద్రారెడ్డి అల్లుడు మంజునాథ్ రెడ్డి.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. అప్పటి నుంచి కాపు రామచంద్రారెడ్డి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.

ఇక కాపు రామచంద్రారెడ్డి 2019 ఎన్నికల్లో రాయదుర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో రాజకీయ ప్రవేశం చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారి గెలిచారు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జరిగిన పరిణామాలతో కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి 2012 ఉప ఎన్నికల్లో రెండోసారి గెలిచారు. 2014లో ఓటమి పాలయ్యారు.

Next Story