- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అనంతపురంలో వైసీపీకి భారీ షాక్.. జైలుకు 19 మంది కీలక శ్రేణులు

X
దిశ, వెబ్ డెస్క్: అనంతపురంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 19 మంది కార్యకర్తలకు కోర్డులో అనూహ్య ఘటన ఎదురైంది. ఓ కేసు విషయంలో 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. 2018లో ఉల్లిమల్లు ముంపు బాధితులకు పరిహారం చెల్లించాలంటూ అనంతపురంలో అప్పటి వైసీపీ ఇంచార్జి సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. అయితే ఈ ఘటనలో 19 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కూడా ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదు. పలుమార్లు ఆదేశించినా పట్టించుకోలేదు. దీంతో వీరందరికి రిమాండ్ విధిస్తూ అనంతపురం రెండో ప్రత్యేక జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. దీంతో 19 మంది వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనతో అనంతపురం వైసీపీకీ గట్టి దెబ్బ తగిలింది.
Next Story