- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Hindupur: నడి రోడ్డుపై కొట్టుకున్న వైసీపీ కౌన్సిలర్లు
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: హిందూపురంలో నడిరోడ్డుపై ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లు కొట్టుకున్నారు. 29వ వార్డులో స్థలం వివాదం తలెత్తింది. దీంతో కౌన్సిలర్లు ఇర్షాద్, రోషన్ పరస్పరం దాడి చేసుకున్నారు. 29వ వార్డులో రోషన్ ఇంటి ఎదురుగా ప్రభుత్వ స్థలంలో 5వ వార్డు కౌన్సిలర్ ఇర్షాద్ ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నం చేశారు. అయితే కౌన్సిలర్ రోషన్ అడ్డుకున్నారు. దీంతో తన ఇంటి నిర్మాణాన్నే అడ్డుకుంటావా? అని ఇర్షాద్ నిలదీశారు. మాటామాటా పెరగడంతో నడి రోడ్డుపై ఇద్దరు కౌన్సిలర్లు బాహాబాహీకి దిగారు. అటు వారి అనుచరులు కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసులు ఉండగానే ఈ కుమ్ములాట జరిగింది. ఎట్టకేలకు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపు చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
Next Story