- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
Ananthapur: ఉరివేసుకుని వాలంటీర్ ఆత్మహత్య

దిశ, రాయదుర్గం: అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రంలో వాలంటీర్ పాటిల్ నవీన్ (32) తన ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. నవీన్‌కు కర్నూలు జిల్లా కోడుమూరు మండలానికి చెందిన అర్చిత (22)తో 2018 సంవత్సరంలో వివాహం అయింది. అయితే ఆస్తి విషయంలో నవీన్ భార్యా, తండ్రి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో తండ్రిని, భార్యని ఒప్పించలేక నవీన్ గతంలో రెండుసార్లు ఆత్మహత్య యత్నాంచారు. అయినా వీరి గొడవలు కొనసాగుతున్నాయి. ఇదే విషయంపై ఇటీవల నవీన్ భార్య పుట్టింటికి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న నవీన్ ఆదివారం రాత్రి ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటిలో నుంచి నవీన్ ఎంసేపటికి బయటికి రాకపోవడంతో స్థానికులు తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే చనిపోయి ఉన్నాడు. దీంతో పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.