ఆ కొండ పై చిరుత సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు

by Jakkula Mamatha |   ( Updated:2025-04-09 14:48:14.0  )
ఆ కొండ పై చిరుత సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు
X

దిశ, ఉరవకొండ: చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలి కొండపై బుధవారం చిరుత పులి సంచారం తో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. పీసీ ప్యాపిలి గ్రామ రైతులకు చెందిన దాదాపు ఏడు గొర్రెలను, మేకలను చిరుత పులి ఎత్తుకొని వెళ్ళినట్లు గ్రామస్తులు తెలిపారు. చిరుత సంచారం ప్రాంతంలో ప్రజలు వెళ్లాలంటే జంకుతున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు చిరుత సంచారం పై ప్రత్యేక నిఘా ఉంచాలని కోరుతున్నారు.



Next Story