Anantapur: వైభవంగా వెంకటేశ్వర స్వామి రథోత్సవం

by srinivas |
Anantapur: వైభవంగా వెంకటేశ్వర స్వామి రథోత్సవం
X

దిశ, కళ్యాణదుర్గం: అనంతపూర్ జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందిర్పిలో అశేష జనవాహిన మధ్య వెంకటేశ్వరస్వామి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాభిషేకం, రథాంగ హోమం, రథ బలి, మాలవీధుల మడుగు రథోత్సవం చేపట్టారు. వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. శ్రీవారిని పల్లకీలో ఆలయం చుట్టూ ఊరేగింపు నిర్వహించి, అనంతరం రథోత్సవంపై ఆసీనులు చేశారు. అనంతరం రథోత్సవాన్ని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, యువకులు, ప్రజలు, భక్తులు లాగారు.

Next Story

Most Viewed