Tragedy: జగనన్న ఇంటి మిద్దెపై ప్రమాదం.. యువకుడు మృతి

by srinivas |   ( Updated:2023-10-25 12:59:45.0  )
Tragedy: జగనన్న ఇంటి మిద్దెపై ప్రమాదం.. యువకుడు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా ఉరవకొండలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ కొట్టడంతో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందారు. ఉరవకొండ రాయంపల్లి దారిలోని జగనన్న కాలనీలో యువకుడు సులేమాన్ కుటుంబం సొంతిళ్లు నిర్మించుకుంటోంది. అయితే ఇంటి మిద్దెపై ఉన్న ఇనుప రాడ్డులను కిందకి పడవేసే క్రమంలో ఎదురుగా ఉన్న విద్యుత్ తీగలకు తగిలాయి. దీంతో సులేమాన్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతన్ని కర్నూలులోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. యువకుడు సులేమాన్ చనిపోయారు. దీంతో సులేమాన్ కుటుంబం ఆందోళనకు దిగింది. విద్యుత్ అధికారుల నిర్లక్షం కారణమని సులేమాన్ మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. సులేమాన్ కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరి విద్యుత్ శాఖ స్పందిస్తుందో లేదో చూడాలి.

Next Story