రామగిరిలో 144 సెక్షన్ అమలు.. కారణం ఇదే!?

by Jakkula Mamatha |
రామగిరిలో 144 సెక్షన్ అమలు.. కారణం ఇదే!?
X

దిశ,ధర్మవరం: శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఎంపీడీఓ ఆఫీస్‌ దగ్గర వైసీపీ, టీడీపీ కార్యకర్తల ఘర్షణ వాతావరణం ఏర్పడింది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు రాడ్లు, కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. పలు వాహనాలు ధ్వంసం ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు రామగిరికి ఎస్పీ రత్న, ధర్మవరం డీఎస్పీ హేమంత్‌ చేరుకున్నారు.

రామగిరి పీఎస్‌కు వాహనాలు పోలీసులు తరలించారు. ఎంపీపీ ఎన్నికల్లో భాగంగా గురువారం రామగిరి మండలంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న సోమందేపల్లి పోలీసులు. గురువారం జరిగే రామగిరి మండల ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో అరెస్ట్ చేసిన పోలీసులు. ఎటువంటి అల్లర్లు జరగకూడదని, ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా ప్రకాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



Next Story

Most Viewed