అర్ధరాత్రి పెట్రోల్ బంక్‌లో దొంగల హల్‌చల్

by Jakkula Mamatha |
అర్ధరాత్రి పెట్రోల్ బంక్‌లో దొంగల హల్‌చల్
X

దిశ, ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో అర్ధరాత్రి దోపిడీ దొంగలు హల్చల్ చేశారు. ఉరవకొండ మండలంలోని ఆమిద్యాల, పెట్రోల్ బంకు, వజ్రకరూరు మండల కేంద్రంలోని పెట్రోల్ బంకులను సిబ్బందిని బెదిరించి కొట్టి పెట్రోల్ బంక్‌లలో రూ.3,70,000 నగదును ఎత్తుకెళ్లారు. ముఖానికి మాస్కులు ధరించి బొలెరో వాహనంలో వచ్చిన దోపిడీ దొంగలు సిబ్బంది మీ బెదిరించి కొట్టి మొత్తం నగదు దోచుకెళ్లారు. సీసీ కెమెరాలు ఉన్న విషయాన్ని గమనించిన దొంగలు సీసీ కెమెరాలు పగలగొట్టి హార్డ్ డిస్క్ ను కూడా ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ కూడా ఎత్తుకెళ్లి పోవడం తో క్లూస్ టీం ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Next Story

Most Viewed