చిన్నారుల మిస్సింగ్ కేసు.. 6 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

by Jakkula Mamatha |
చిన్నారుల మిస్సింగ్ కేసు.. 6 గంటల్లోనే ఛేదించిన పోలీసులు
X

దిశ,ప్రతినిధి ధర్మవరం: బత్తలపల్లి మండలం సూర్యచంద్రపురం గ్రామానికి చెందిన కుళ్లాయప్ప భార్య సాకే గంగాభవాని భార్యాభర్తలు వీరి మధ్య గొడవల కారణంగా తన ముగ్గురు బిడ్డలతో చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఈ విషయాన్ని 100 డయల్ కు సమాచారం అందించారు. వెంటనే శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ రత్న వెంటనే బత్తలపల్లి పోలీసులకు ఆచూకీ తెలుసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. బత్తలపల్లి సీఐ ,ఎస్ఐల పర్యవేక్షణలో ఏఎస్ఐ విజయ్ కుమార్, కానిస్టేబుల్ గోపాల్‌ను పంపించి వెతుకులాట ప్రారంభించారు. ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. బస్టాండ్ రైల్వే స్టేషన్లు ప్రధాన కూడలిలో గాలించారు. యల్లనూరు మండలం లోని చిలమకూరు గ్రామంలో వారి పుట్టినిల్లు కావడంతో అక్కడ వెళ్లి గాలింపు చర్యలు చేశారు.

వారి బంధువులు పులివెందులలో ఉన్నారని సమాచారంతో అక్కడికి వెళ్లి కుటుంబ సభ్యులతో ఆరాధియగా వారి మేనత్త ఇంట్లో తప్పిపోయిన తల్లి, ముగ్గురు బిడ్డలు ఉన్నారని సమాచారం తెలుసుకున్న పోలీసులు తెల్లవారుజామున నాలుగు గంటలకు వారిని జాగ్రత్తగా పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మిస్సింగ్ కేసు ఫిర్యాదు అందిన 6 గంటలకు లోపే కేసును చేదించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందిస్తూ రివార్డులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై విచారించి తగిన సమయంలోనే బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని చేదించే విధంగా పోలీస్ శాఖ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. తప్పిపోయిన వారిని 6 గంటల లోపల పట్టుకొని వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం పట్ల పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story

Most Viewed