- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
AP:నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేయండి: జనసేన పార్టీ ఇంచార్జ్
by Jakkula Mamatha |

X
దిశ, రాప్తాడు:నియోజకవర్గం అభివృద్ధికి పెద్దపీట వేసేలా అధిక నిధులు మంజూరు చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను రాప్తాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి సాకే పవన్ కుమార్ కోరారు. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఆయన మంగళవారం కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గత ఐదేళ్ళ వైసీపీ హయాంలో రాప్తాడు నియోజకవర్గం అభివృద్ధి కుంటుపడిందని, ప్రత్యేక దృష్టి సారించాలని సాకే పవన్ కోరారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఉన్న సమస్యల గురించి చర్చించి వాటికి పరిష్కారాలను త్వరలోనే మన కూటమి ప్రభుత్వంలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారన్నారు. త్వరలోనే నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలను కలుస్తానని తెలియజేశామన్నారు.
Next Story