వైసీపీలో తారాస్థాయికి వర్గపోరు.. పార్టీ కండువాను తోసేసిన మున్సిపల్ చైర్మన్

by srinivas |
వైసీపీలో తారాస్థాయికి వర్గపోరు.. పార్టీ కండువాను తోసేసిన మున్సిపల్ చైర్మన్
X

దిశ, వెబ్ డెస్క్: హిందూపురం వైసీపీ(Hindupuram YCP)లో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరాయి. పార్టీ మూడుగా చీలిపోయింది. నేతలు, నాయకులు, కార్యకర్తల మధ్య అసలు పొసడగడం లేదు. పార్టీ కార్యక్రమాలు సైతం కలిసికట్టుగా కాకుండా ఎవరికి వారే నిర్వహించుకుంటున్నారు. ఈ రోజు జరిగిన హిందూపురం మున్సిపాలిటీ కౌన్సిల్ మీటింగ్‌లో ఒక్కసారిగా బయట పడింది. కౌన్సిల్ మీటింగ్‌కు వచ్చిన మున్సిపల్ చైర్మన్ బలరాంరెడ్డి(Municipal Chairman Balaram Reddy)కి 32వ వార్డు కన్సిలర్ ఆసిఫ్.. పార్టీ కండువా కప్పే ప్రయత్నంచేశారు. అయితే ఆయన కండువాను తోసేశారు. అంతేకాదు పార్టీ నాయకులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఎవరూ సహకరించడంలేదని మండిపడ్డారు.


అయితే హిందూపురం వైసీపీపరిస్థితి ఇప్పటికే ఆ పార్టీ అధినేత జగన్ దృష్టికి వెళ్లింది. అయినా వర్గవిభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పలువురు వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే హిందూపురం మున్సిపాలిటీలో పార్టీ పట్టుకోల్పోతుందని పలువురు నాయకులు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Next Story

Most Viewed