- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
వైసీపీని వీడిన కుమారులు.. తండ్రికి షాక్ ఇచ్చిన వాలంటీర్
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో వైఎస్సార్ నాయకుల అరాచకాలు మరింత ఎక్కువ అయ్యాయి. టీడీపీ మద్దతుదారులు, వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారికి పథకాలు కట్ చేస్తున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులకు పడుతున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లా విడనపకల్లు మండలం చీకలగురిలో జరిగింది. డప్పు కళాకరుడు రామాంజనేయులు పెన్షన్‌ను నిలిపివేశారు. అందరికి నిన్న పంపిణీ చేసి రామాంజనేయులకు మాత్రం ఇవ్వలేదు. ఇందుకు కారణం రామాంజనేయులు కుమారులు ఇటీవల టీడీపీలో చేరడమే. రామాంజనేయులకు ఇద్దరు కుమారులు. వీరిద్దరూ గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో ఈ నెల పింఛన్‌ను రామాంజనేయులకు వార్డు వాలంటీర్ ఇవ్వలేదు. ఎందుకని నిలదీస్తే తనకు తెలియదని.. అధికారులను అడగాలని తెలిపారు. దీంతో అధికారులను రామాంజనేయులు నిలదీశారు. వైసీపీ నుంచి బయటకు ఎందుకు వెళ్లారని, అందుకే పింఛన్ నిలిపివేశామని చెప్పారు. దీంతో రామాంజనేయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీలో ఉంటేనే పింఛన్ ఇస్తారా అని వాపోయారు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు.