- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Terrible Tragedy: ఇద్దరిని కాపాడబోయి.. మరో ఇద్దరు మృతి

దిశ, అనంతపురం: నీటిలో మునిగిపోతోన్న భార్యను, కూతురిని కాపాడడం కోసం నీటి గుంతలో దిగి వారిద్దరిని కాపాడి భార్త మునిగిపోయారు. అయితే ఆయనను కాపాడడానికి మరో వ్యక్తి నీటి గుంతలోకి దూకాడు. దీంతో ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలో జరిగింది. కర్నూలు జిల్లాకు చెంది బెంగళూరులో స్థిరపడ్డ వెంకట నారాయణ (37), శ్రీనాథ్ (20) పెద్దపప్పూరు సమీపంలో ఉన్న పెన్నా నది ప్రవాహంలో చనిపోయారు.
ప్యాపిలి మండలం రాచర్ల గ్రామానికి చెందిన వెంకట నారాయణ బెంగళూరులో స్థిరపడి ప్రియ సిమెంట్ కంపెనీ డీలర్‌గా వ్యాపారం చేసుకుంటున్నారు. అయితే భార్య లక్ష్మీదేవి, పిల్లలతో పాటు అతని వద్ద పని చేసే వ్యక్తితో కలసి వెంకట నారాయణ పెద్దపప్పూరులో నిర్వహించే అశ్వర్థనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన తరువాత ఇద్దరు కుమారులు, కుమార్తెకు తలనీలాలు సమర్పించారు. అనంతరం పెన్నా నదిలో భార్య, కూతురు స్నానానికి వెళ్లారు. అక్కడ ఉన్న నీటి గుంతలో మునిగిపోతూ ఉండగా వెంకట నారాయణ వారిని రక్షించారు. అయితే ప్రమాదవాశాత్తు ఆయన మునిగిపోతుండగా అతని వద్ద పని చేసే శ్రీనాథ్ అనే యువకుడు నీటి గుంతలోకి దూకాడు. ఈ క్రమంలో ఇద్దరూ నీటి గుంతలో మునిగిపోయారు.
అయితే వారిని స్థానికులు బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలం వద్ద భార్య పిల్లల రోదనలతో విషాదం నెలకొంది. పిల్లలు తండ్రి మృతదేహంపై పడి నాన్న పైకి లే ... నాన్న పైకి లే అంటూ ఏడవడం చూపరులను కంటతడి పెట్టించింది.