Satyasai Dist: గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌‌లో సాంకేతిక లోపం

by srinivas |
Satyasai Dist: గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌‌లో సాంకేతిక లోపం
X

దిశ, వెబ్ డెస్క్: గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో సత్యసాయి జిల్లా పందపర్తి స్టేషన్ వద్ద రైలు ఆగిపోయింది. విద్యుత్ తీగలో సమస్యతో ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. గరీబ్ రథ్ ఆగపోవడంతో హైదరాబాద్-బెంగళూరు మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మరమ్మతుల అనంతరం రైలు యథావిధిగా వెళ్లే అవకాశం ఉంది. అయితే రైలులో విద్యుత్ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

Next Story