- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తెలుగు క్రికెట్ అభిమానులకు పండగే..అనంతపురంలో టీమిండియా స్టార్ క్రికెటర్లు

దిశ ప్రతినిధి, అనంతపురం:నగరంలో పలువురు భారత క్రికెటర్లు మంగళవారం సందడి చేశారు. ఈనెల ఐదు (గురువారం) నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో పాల్గొనేందుకు సోమవారం రాత్రికే చాలామంది అనంతపురం చేరుకున్నారు. మాసినేని గ్రాండ్, సూరజ్ గ్రాండ్ హోటళ్లలో వారికి బస ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం వారు ఆర్డీటీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో స్టేడియం వద్దకు చేరుకుని నెట్ ప్రాక్టీస్ లో పాల్గొన్నారు.
వారిని చూసేందుకు అభిమానులు అటు హోటళ్ల వద్ద, ఇటు స్టేడియం వద్ద అమితాసక్తి ప్రదర్శించారు. నెట్ ప్రాక్టీస్ లో పాల్గొన్న క్రికెటర్లలో శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష దీప్ సింగ్, అక్షర్ పటేల్, సాయి సుదర్శన్, రజత్ పటీదార్, అభిషేక్ పోరల్, ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్ తదితరులున్నారు. కాగా, మ్యాచ్ ల గడువు సమీపిస్తుండటంతో ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు. గట్టి పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు.