- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Kalyanadurg: మంత్రి అనుచరుల ఆగడాలకు అడ్డుకట్టలేదా...?

దిశ, కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మంత్రి అనుచరుల ఆగడాలకు అడ్డుకట్ట లేదా అంటూ కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు ప్రశ్నించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎన్టీఆర్ భవన్‌లో ఉమామహేశ్వరనాయుడు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి ఉషశ్రీ చరణ్, అనుచరుల ఆగడాలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయని మండిపడ్డారు. ప్రైవేట్ ఆస్తులకు కూడా రక్షణ లేకుండా పోతోందని విమర్శించారు.
తాజాగా శెట్టూరు మండల పరిధిలోని అయ్యగార్లపల్లిలో అధికార పార్టీ జెడ్పిటీసీ సభ్యుడు, మంత్రి ప్రధాన అనుచరుడు మంజునాథ్ బాధిత కుటుంబాన్ని బెదిరించి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. వీరి బెదిరింపులకు భయపడి బాధిత కుటుంబం ఎక్కడో అనంతపురంలో తలదాచుకుంటే అక్కడికి కూడా మంత్రి అనుచర వర్గం వెళ్లి భయాన్ని సృష్టించి చంపేస్తామంటూ బెదిరించి మిగతా భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారన్నారు. బాధిత కుటుంబం సాక్షాత్తు జిల్లా ఎస్పీ కళ్యాణదుర్గం డీఎస్పీ కూడా ఫిర్యాదు చేసిన వారిపై ఏమాత్రం చర్యలు తీసుకోలేదని చెప్పారు. ఈ బెదిరింపుల పర్వం సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేసిన పోలీసులు వాటి సంగతినే పూర్తిగా విస్మరించి తమకెందుకులే అన్నట్లుగా నిమ్మకు నీరెత్తినట్లు పోలీస్ శాఖ వ్యవహరిస్తుందని విమర్శించారు.
ఏదైనా చిన్న సమస్యను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కేసులు పెట్టే పోలీసులు ఇప్పుడు ఇలాంటి వాటిపై ఎందుకు దృష్టి సారించలేదని పోలీసులను ప్రశ్నించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యంగా మారిపోయిందని విమర్శించారు బాధిత కుటుంబానికి టిడిపి పార్టీ అండగా ఉంటూ న్యాయపరంగా పోరాటం చేసేందుకు బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని ఉమామహేశ్వరనాయుడు హామీ ఇచ్చారు.