- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Kalyandurg: ఆ డబ్బు ఇస్తా.. 168 ఎకరాలు తిరిగిస్తారా?.. మంత్రికి చంద్రబాబు సూటి ప్రశ్న

దిశ, వెబ్ డెస్క్: మంత్రి ఉషాశ్రీ చరణ్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో పర్యటించిన ఆయన మంత్రి ఉషా శ్రీ చరణ్ కబ్బాలపై మండిపడ్డారు. కళ్యాణదుర్గంలో అన్నీ కబ్జాలు, సెటిల్‌మెంట్లేనని ధ్వజమెత్తారు. 168 ఎకరాలు తక్కువ ధరకే మంత్రి లాక్కున్నారని ఆరోపించారు. లే అవుట్ వేస్తే డబ్బులియ్యాల్సిందేనని తెలిపారు. మంత్రి కొట్టేసిన 168 ఎకరాలకు తాను డబ్బు ఇస్తానని, తిరిగిస్తారా అని ప్రశ్నించారు. దసరాకు పూర్తి మేనిఫెస్టో ప్రకటిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. పుంగనూరులో ప్రశ్నిస్తే తనపై కూడా కేసులు పెట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూడా చాలా కేసులు పెట్టారని గుర్తు చేశారు. తనను అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారని, ఇలాంటి బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదన్నారు. రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేస్తున్నారని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.