- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Jc వర్సెస్ Peddareddy.. మళ్లీ మాటల యుద్ధం

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లాలో జేసీ సోదరులు, ఎమ్మెల్యే కేతిరెడ్ది పెద్దిరెడ్డి గురించి జనాలకు పెద్దక చెప్పనవరం లేదు. ప్రతి నిత్యం వీరి మధ్య మాటల యుద్ధం నడుస్తుంటుంది. ఏదో ఒక విషయంపై తాడిపత్రిలో అధిపత్య పోరు కొనసాగుతూనే ఉంటోంది. తాజాగా సాగు, తాగు నీరు విషయంలో విమర్శలు, ప్రతివిమర్శలు జరుగుతున్నాయి. HLC కెనాల్‌కు నీళ్లు రావడంలేదని, దీని వల్ల సాగు, తాగు నీటికి ఇబ్బంది అవుతోందని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. HLC కెనాల్‌కు నీళ్లు కేటాయించాలని ఎస్ఈ రాజశేఖర్‌కు జేసీ దివాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జలవనరుల శాఖను సరైన సమాదేశం లేకపోవడం జేసీ దివాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. HLCలో నీరు లేకపోతే ఇసుక అమ్ముకోవచ్చనే ఉద్దేశంతోనే హెచ్‌ఎల్‌సీకి నీరు ఇవ్వడంలేదని ఆరోపించారు. ఇసుక ఆదాయం కోసం రైతులను నాశనం చేస్తున్నారని జేసీ దివాకర్ రెడ్డి మండిపడ్డారు.
దీంతో జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హెచ్ఎల్సీ కాలువకు నీళ్లు వస్తున్నాయని.. అయినా ఎస్ఈని అడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకు 250 క్యూసెక్కుల నీరు వెళ్తోందని చెప్పారు. పెద్ద వడగూరు కూడా నీళ్లు అందుతున్నాయని పెద్దారెడ్డి స్పష్టం చేశారు. పాపం జేసీ దివాకర్ రెడ్డి ఆరోగ్యం బాగోలేదని, ఆయన మతి లేదని అంటూ విమర్శలు కురిపించారు. ‘తాడిపత్రి అభివృద్ధికి ప్రతి రోజు అడ్డుపడేది జేసీ దివాకర్ రెడ్డి తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు, కాలేజ్ కాంపౌండ్‌కు ఇలా ప్రతి దానికి అడ్డంపడుతున్నారు.’ అని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు.