Kadiri: పోలీసుల తీరుపై చంద్రబాబు మండిపాటు

by srinivas |
Kadiri: పోలీసుల తీరుపై చంద్రబాబు మండిపాటు
X

దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరిలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు టీడీపీ శ్రేణులు పోటెత్తారు. అయితే సభలో పోలీసులు కనిపించకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు భద్రత కల్పించకడంలేదని ఆయన మండిపడ్డారు. భారీ జనసందోహం వద్ద పోలీసులు ఎందుకు భద్రత పెట్టలేదని ప్రశ్నించారు. పోలీసులు ఊడిగం మాని ప్రజలకు సేవ చేయాలని సూచించారు. ఊడిగం చేయాలనుకుంటే యూనిఫామ్ వదలి వెళ్లాలని చంద్రబాబు హెచ్చరించారు. యువత భవిష్యత్తు కోసం తన పోరాటమని చంద్రబాబు తెలిపారు. ఆలమట్టి, తుంగభద్రపై ప్రాజెక్టులు కడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గోదావరి నీళ్లు సీమకు రాకుంటే భవిష్యత్తులో తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. పోలవరం పూర్తి అయితే ఏ సమస్యా ఉండదని చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story

Most Viewed