కంబదూరు మండలం లో తలారి రంగయ్య సుడిగాలి పర్యటన..

by Jakkula Mamatha |
కంబదూరు మండలం లో తలారి రంగయ్య సుడిగాలి పర్యటన..
X

దిశ, ప్రతినిధి: కంబదూరు మండలంలో శుక్రవారం అనంతపురం జిల్లా ఎంపీ కళ్యాణదుర్గం వైకాపా సమన్వయకర్త తలారి రంగయ్య సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మండల పరిధిలోని రాంపురం ,ఎగువపల్లి, ఎరేమల్లేపల్లి , వెంకటంపల్లి, తాళ్లూరు, కొత్తమిద్దల, ములకనూరు, కదిరిదేవరపల్లి గ్రామాల్లో పర్యటించి వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులతో ఆత్మీయ సమావేశాలకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణదుర్గం కోటపై వైఎస్ఆర్ సీపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా నాయకులందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి , సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులకు కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. తమ దృష్టికి వచ్చిన ప్రజాసమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయనకు వైఎస్ఆర్ సీపీ నాయకులు ఘన స్వాగతం పలుకుతున్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed