JC Prabhakar Reddy: ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఒత్తిడి వల్లే తాడిపత్రి సీఐ ఆత్మహత్య

by srinivas |
JC Prabhakar Reddy: ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఒత్తిడి వల్లే తాడిపత్రి సీఐ ఆత్మహత్య
X

దిశ, డైనమిక్ బ్యూరో: తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు ఆత్మహత్యపై మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఒత్తిడితోనే తాడిపత్రి సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆనందరావు ఆత్మహత్య విషయం తెలియగానే సీఐ ఇంటికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. సీఐ ఆనందరావు ఆత్మహత్య విషయం తెలుసుకుని ఆయన ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే సీఐ ఫోన్ డేటాను డిలీట్ చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. సీఐ ఆనందరావుపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఒత్తిళ్లు తీసుకువచ్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి వేధింపులు భరించలేక ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.

మరోవైపు సీఐ ఆనందరావు సూసైడ్ నోట్ ఏమైందో చెప్పాలని నిలదీశారు. ప్రభుత్వం నుండి వచ్చే సహాయం రాదని సీఐ ఆనందరావు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పెద్దారెడ్డి బెదిరించారని..అందువల్లే వారు నోరు విప్పడం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.

Next Story

Most Viewed