- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఒక సూసైడ్.. బయటపడ్డ మరో షాకింగ్ న్యూస్.. SI ఏం చేశాడంటే..?

దిశ, వెబ్‌డెస్క్: అతడు చట్టాన్ని కాపాడాల్సిన వృత్తిలో ఉన్నాడు. అన్యాయం చేసినవారిని శిక్షించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాల్సిన పోలీస్ జాబ్ అతనిది. కానీ అలాంటి వ్యక్తే తప్పు చేస్తే..? తాను చేసిన మోసానికి ఓ నిండు ప్రాణం బలైతే..? బాధితులు ఎవరిని ఆశ్రయించాలి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తేలా చేశాడు ఓ పోలీస్. మోసం చేసి ఓ యువతి సూసైడ్ చేసుకునే పరిస్థితి తెచ్చాడు ఆ మాయగాడు. ప్రస్తుతం అతను చేసిన పనికి కటకటాల బయట కుర్చీలో కూర్చోవాల్సినవాడు, కటకటాల వెనుక ఊచలు లెక్కపెడుతున్నాడు.
వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా పామిడి మండలంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. జీఏ కొట్టాలకు చెందిన సరస్వతి తిరుపతిలో డిగ్రీ చదువుతుంది. ఈ క్రమంలోనే సరస్వతిని ట్రాప్ లో దించాడు చంద్రగిరి ఎస్‌ఐ విజయ్ కుమార్. తీరా పెళ్లి మాట వచ్చేసరికి అసలు విషయం బయటపడింది. విజయ్ కుమార్‌కి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, మాయమాటలు చెప్పి తనకు దగ్గరై చివరకు ఇలా వంచించాడాని సరస్వతి గ్రహించింది. తనకు జరిగిన మోసాన్ని తట్టుకోలేని ఆమె సూసైడ్ చేసుకుంది. దీనిపై బాధితురాలి కుటుంబసభ్యులు ఎస్‌ఐ విజయ్ కుమార్‌పై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎస్‌ఐ విజయ్ కుమార్‌ను అరెస్టు చేశారు.
కాగా పోలీసుల విచారణలో మరో షాకింగ్ విషయం బయటపడింది. ఎస్‌ఐ విజయ్ కుమార్‌పై ఇదివరకే దిశ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు అతడు ఫిర్యాదు చేసిన అమ్మాయినే పెళ్లి కూడా చేసుకున్నాడు. తనకి ఆల్రెడీ పెళ్లి అయిందన్న విషయాన్ని సరస్వతికి చెప్పకుండా ప్రేమ పేరుతో మోసం చేసి ఆమె ప్రాణాలు తీసుకోవడానికి కారణమయ్యాడు విజయ్ కుమార్. కాగా తాడిపత్రి డీఎస్పీ చైతన్య.. విజయ్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.