- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
JNTUAలో కన్వీనర్ కోటా సీట్లకు స్పాట్ అడ్మిషన్లు
by srinivas |

X
దిశ, అనంతపురం: అనంతపురం JNTUAలో మిగిలిపోయిన B. Pharmacy and Pharma.D కన్వీనర్ కోటా సీట్లకు ఈ నెల 24న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ బి. ఈశ్వర్ రెడ్డి తెలిపారు. JNTU అనుబంధ కళాశాల OTPRIలో పరిపాలన భవనం నందు అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుందని ఆయన తెలిపారు. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు అన్ని ఒరిజినల్ సరిఫికెట్లతో పాటు జిరాక్స్ కాపీలు తీసుకుని రావాలని పేర్కొన్నారు. ప్రాసెసింగ్ ఫీజు, ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. స్పాట్ అడ్మిషన్ సీటు పొందిన విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులు కాదని తెలిపారు. మరిన్ని వివరాల కొరకు www.jntua.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించగలరని ప్రొఫెసర్ బి. ఈశ్వర్ రెడ్డి తెలిపారు.
Next Story