Spandana కార్యక్రమంలో ఒకే ఒక్కడు

by srinivas |
Spandana కార్యక్రమంలో ఒకే ఒక్కడు
X

దిశ కళ్యాణదుర్గం: కంబదూరు మండల తహసీల్దారు కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి తహసీల్దారు నయాజ్ అహ్మద్ మినహా ఏ ఒక్క శాఖకు చెందిన అధికారులు హాజరు కాకపోవడంతో వైసీపీ నాయకుడు రాళ్ల అనంతపురం భీమేష్ అధికారుల విధుల నిర్వహణ తీరు పట్ల మండిపడ్డారు. కేవలం ఉపాధి శాఖకు చెందిన ఏపీవో సుధాకర్ మినహా ఇతర శాఖకు చెందిన అధికారులు స్పందన కార్యక్రమానికి హాజరు కాకపోతే తహసీల్దారు కుర్చీకు ఏ మాత్రం గౌరవం ఉందో అర్థం చేసుకోవాలని తహసీల్దారు నయాజ్ అహ్మద్‌తో ఆయన వాగ్వివాదానికి దిగారు. ఏ అధికారి ఎక్కడుంటారో, ఎప్పుడొస్తారో, వెళ్తారో తెలియదు కాని, కనీసం ప్రతి శాఖకు చెందిన మండల స్థాయి అధికారి ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత తహసీల్దారుపై ఉందని గుర్తిస్తూ, విధులను నిర్వర్తించాల్సి ఉందని భీమేష్ అన్నారు. కుంటి సాకులు చెప్పకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన కోరారు. స్పందన కార్యక్రమానికి గైర్హాజరు అయిన అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని రాళ్ల అనంతపురం భీమేష్ వినతిపత్రాన్ని సమర్పించారు.

Next Story