Anantapur: సజావుగా ఎస్సై ఉద్యోగాల ప్రాథమిక పరీక్షలు

by Disha Web Desk 16 |
Anantapur: సజావుగా ఎస్సై ఉద్యోగాల ప్రాథమిక పరీక్షలు
X

దిశ, అనంతపురం: ఎస్సై ఉద్యోగాల ప్రాథమిక పరీక్షలు సజావుగా జరిగాయి. అనంతపురం SSBN, JNTU తదితర సెంటర్లలో రాత పరీక్షల నిర్వహించారు. 13,423 మంది హాజరు కావాల్సి ఉండగా ఉదయం సెషన్‌కు 11,971 ... మధ్యాహ్నం సెషన్‌కు 11,946 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. పరీక్షల నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లాలో 20 ఎగ్జామ్స్ సెంటర్లు ఏర్పాటు చేశారు.

ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన 13,423 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో పోలీస్ ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో నిఘా ఉంచారు. మాల్ ప్రాక్టీస్ , మాస్ కాఫీయింగ్ జరుగకుండా ఈ బృందాలు పర్యవేక్షించాయి. ఎగ్జామ్స్ సెంటర్స్ వెలుపల 144 సెక్షన్ అమలు చేశారు. పరీక్షా కేంద్రాల పరిసరాలలో జిరాక్స్ సెంటర్లు మూసేయించారు. అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సుల సౌకర్యం కూడా కల్పించారు. ప్రశాంతంగా, సజావుగా పరీక్షలు నిర్వహించేలా అన్ని చర్యలు తీసుకున్నారు. సాయంత్రం 5:30 గంటలతో ఈ పరీక్షలు ముగిశాయి. ఆ పత్రాలు స్ట్రాంగు రూమ్‌లకు వెళ్లేంత వరకు కూడా పోలీసులు పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు.

Next Story

Most Viewed