- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Kalyanadurgam: జగన్ సారూ... పింఛన్ ఇవ్వరూ...!

X
దిశ కళ్యాణదుర్గం: కంబదూరు మండలం పి.వెంకటంపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ఒంటరి వృద్ధ మహిళ అంకె లక్ష్మమ్మ (59 ) పింఛన్ మంజూరు చేయాలంటూ అధికారులకు మొరపెట్టుకున్నారు. మూడు సంవత్సరాల క్రితం తన భర్త అంకె ఓబన్న మతిస్థిమితం కోల్పోయి అదృశ్యం కావడంతో అప్పటి నుంచి జీవనదారం లేక, పూట గడవటం కష్టంగా మారిందని మీడియా ముందు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటింటా పెట్టిన మెతుకులతో ఆకలి తీర్చుకుంటున్నానని లక్ష్మమ్మ వాపోయారు. ఇల్లు కూడా లేకపోవడంతో గోడ చాటున జీవిస్తున్నానని కన్నీరు పెట్టుకున్నారు. చాలా రోజుల నుంచి ఒంటరి పింఛన్ మంజూరు చేయాలని అధికారులను అడిగినప్పటికి భర్త మరణ ధృవీకరణ పత్రాలను తీసుకురావాలంటూ సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పింఛన్ మంజూరు చేయాలని వృద్ధురాలు లక్ష్మమ్మ కోరుతున్నారు.
Next Story