- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
SPMRM పనుల్లో కోట్ల రూపాయల అవినీతి..విచారణ చేపట్టిన లోకాయుక్త

- పథకం ఉద్దేశాన్ని నీరుగార్చిన అధికారులు
- పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు
దిశ, కళ్యాణదుర్గం: గ్రామీణ ప్రాంతాలను పట్టణాల దిశగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2016,17లో శ్యాం ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ మిషన్ పథకానికి శ్రీకారం చుట్టాయి. ఈ పథకంలో భాగంగా రాయలసీమలోని కంబదూరు, కుప్పం మండలాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించాయి.అందుకు అనుగుణంగా పనులు కూడా చేపట్టాయి. అయితే ఇప్పటికీ పనులు పూర్తి కాక కొన్ని బిల్డింగులు ఆగిపోయాయి. మొత్తం 12 పంచాయతీల్లో రూ.127 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం 40%, రాష్ట్ర ప్రభుత్వం 60 శాతం నిధులు కేటాయించాయి. గ్రామీణ రహదారులు, ఉపాధి నైపుణ్య శిక్షణ, స్వచ్ఛభారత్ కింద వ్యక్తిగత మరుగుదొడ్లు, సిమెంట్ రహదారులు, భూగర్భ మురికి కాలువలు, విద్యుత్ వెలుగు పనులు 2016 నుంచి 2019 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. మొదటి విడతలో 714 పనులకు రూ. 31.13 కోట్లు మంజూరయ్యాయి. 2017 సంవత్సరంలో పలు గ్రామ పంచాయతీల్లో సిమెంట్ రహదారులు మాత్రమే వేశారు. మిగిలిన అంశాలకు సంబంధించిన పనులు అర్ధాంతంగా ఆగిపోయాయి. అయితే పథకం అమలులో జవాబుదారితనం, చిత్తశుద్ధి, అంకితభావం కొరవడింది. నిధులు సకాలంలో ఖర్చు చేయని దయనీయ పరిస్థితి నెలకొంది. 739 పనులకు రెండో విడతగా రూ. 36. 88 కోట్లు వచ్చాయి. అయితే అధికారులు పూర్తిస్థాయిలో పనులను జరుపుకుండా ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనుక్కు అనే విధంగా నిర్లక్ష్యం వహించారు. దాంతో పనులు నిలిచిపోయాయి.
కంబదూరు పంచాయతీలో సిమెంట్ రహదారులు, తాగునీటి పైపు లైనులు, భూగర్భ డ్రైనేజీ వంటివి 216 పనులు చేపట్టారు. ఇందులో 128 మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన వాటికి కాలువలు తీసి కనెక్షన్లు ఇవ్వకుండా వదిలేశారు. కంబదూరులో కేజీబీవీ పాఠశాల పక్కన సీడీపీవో భవనం నిర్మాణం చేపడుతున్నామనీ చెప్పుకుంటున్న అధికారులు ప్లానింగ్‌లో మాత్రం దాన్ని ఎరువుల దుకాణంగా పెట్టడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.50 లక్షలతో ఎంపీడీవో కార్యాలయం పనులు చేపట్టారు. అయితే అది అర్ధాంతరంగా పనులు నిలిపివేశారు. పూర్తిస్థాయిలో బిల్లులందలేదా, వచ్చిన బిల్లులు మింగేసి పనులు ఆగిపోయాయా? అని ప్రజలు అనుమానిస్తున్నారు.
కంప్యూటర్ నైపుణ్యం శిక్షణ కింద దాదాపు కోటి రూపాయలతో ఉపాధి లేని యువతకు తూతూ మంత్రంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగం చూపకుండా నిధులు నొక్కేసినట్లు సమాచారం. దీంతో పాటు డ్రైవింగ్, కుట్టు మిషన్ , అంశాలను సినిమా షూటింగ్ తీసినట్లు మాత్రమే తాత్కాలికంగా ఏర్పాటు చేసి తర్వాత అధికారులు నిధులు మాయం చేసినట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద చేపట్టిన పనులలో ఆన్ లైన్‌లో ఒక రకంగా ఫీల్డ్ పరంగా ఒక రకంగా పొంతన లేకుండా గ్రాఫిక్ చేస్తూ ప్లానింగ్ చేపట్టారు. అయితే ఈ పథకం కింద కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని కొందరు వ్యక్తులపై అధికారులకు ఫిర్యాదు చేయడంతో పలుమార్లు ఈ పథకం కింద చేపట్టిన పనులకు సామాజిక తనిఖీ నిర్వహించారు సామాజిక తనిఖీలో అవినీతి జరిగిందని తెలిసినా కూడా ఉన్నత అధికారులు కుంభకోణాన్ని కప్పేసి చేతివాటం ప్రదర్శించారని సామాజిక తనిఖీలు పాల్గొన్న అప్పట్లో ప్రజలు మీడియాకు తెలిపారు. ఇదే అంశాలపై లోకయుక్త కోర్టుకు ఫిర్యాదులు అందడంతో సంబంధిత అధికారులు గతంలో కంబదూరు మండలంలో పర్యటించి రుబ్బన్ పథకం కింద చేపట్టిన పనులపై విచారణ చేపట్టారు. అయితే లోకయుక్త అధికారులు ఏ స్థాయిలో కోర్టుకు నివేదిక అందజేస్తారనేది తెలియాల్సి ఉంది. అప్పట్లో కంబదూర్ ఎంపీడీవో కార్యాలయంలో విధులు నిర్వహించిన ఎంపీడీవో శివారెడ్డి నేతృత్వంలో ఈ పథకంలో భారీగా అవినీతి జరిగాయని ప్రజలు అంటున్నారు. ఈ పథకంలో అవినీతి జరిగిందని కళ్ళ ఎదుట కనిపించినా కూడా ఉన్నతాధికారులు సంబంధిత అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి.
ఇదే అంశాన్ని ఎంపీడీవో ఆంజనేయులును వివరణ కోరగా ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో పూర్తి చేయకపోతే ఆ పనులు చేపట్టిన అధికారుల జీతాల్లో రికవరీ చేస్తామని వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గడిచిన జనవరి నెలాఖరిలోపు రూర్బన్ మిషన్ పథకం కింద పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని ఆదేశించారని తెలిపారు. అయితే తాను కొత్తగా వచ్చానని, రూర్బన్ పనులకు సంబంధించిన రికార్డులు తనకు ఇంతవరకు అప్ప చెప్పడం పలు విమర్శలకు తావిస్తోంది.