Water Work Employees: జీతాలు చెల్లించకపోతే నీళ్లు వదలం..!

by srinivas |
Water Work Employees: జీతాలు చెల్లించకపోతే నీళ్లు వదలం..!
X

దిశ, కళ్యాణదుర్గం: తమకు రావాల్సిన వేతనాలు, ఇతర బకాయిలు వెంటనే చెల్లించాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సత్యసాయి నీటి పథకం ఉద్యోగులు అర్థనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఐదు నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను శాశ్వత ఉద్యోగులుగా ప్రకటించాలని, వెంటనే బకాయిలు చెల్లించకపోతే సమ్మె కొనసాగిస్తూ గ్రామీణ ప్రాంతాలకు నీటిని వదలబోమని హెచ్చరించారు.

కాగా సత్యసాయి నీటి పథకానికి సంబంధించిన ఉద్యోగులు మోటార్ పంపులు ఆఫ్ చేసి నాలుగు రోజుల క్రితం సమ్మెలోకి వెళ్లారు. దీంతో అనంతపురం జిల్లాలోని వందలాది గ్రామాలకు నీటి సరఫరా ఆగిపోయింది. తాజాగా కళ్యాణదుర్గం సత్యసాయి నీటి పథకానికి సంబంధించిన పంపు హౌస్ ముందు ఉద్యోగులు అర్ధ నగ్న ప్రదర్శన వ్యక్తం చేశారు. తమకు అందాల్సిన వేతనంతో పాటు ఇతర బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed