కళ్యాణదుర్గంలో పడకేసిన పారిశుధ్యం

by srinivas |
కళ్యాణదుర్గంలో పడకేసిన పారిశుధ్యం
X

దిశ, కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలో పారిశుధ్యం పడకేసింది. పారిశుధ్య కార్మికుల సమ్మెతో జూనియర్ కాలేజ్‌కి వెళ్ళే రహదారికి ఇరువైపులా చెత్తాచెదారం పోరుకుపోయింది. దీంతో అపరిశుభ్రత నెలకొంది. దుర్గంధం వెదజల్లడంతో రోగాలు వ్యాపించే అవకాశం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. . అటు దోమలు బెడద కూడా ఎక్కువైందని చెబుతున్నారు. మున్సిపల్ అధికారులు చెత్తను తీసుకెళ్లడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడుతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు చెత్తను తొలగించి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story