రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు పట్టివేత

by srinivas |
రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు పట్టివేత
X

దిశ, అనంతపురం: ఇంటికి వాడేసిన ఎర్రచందనం దుంగలను మొక్కజొన్న బస్తాల మాటున అక్రమంగా తరలిస్తున్న ఐచర్ వాహనాన్ని పెద్దవడుగూరు పోలీసులు పట్టుకున్నారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కాశేపల్లి టోల్ ప్లాజా వద్ద ఎస్సై రాజశేఖరరెడ్డి తన సిబ్బందితో వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో హైదరాబాదు నుంచి అనంతపురం వైపు వెళ్తున్న ఐచర్ వాహనంలో మొక్కజొన్న బస్తాలు వేసుకుని తరలిస్తుండగా వాటిని పోలీసులు తనిఖీలు చేయగా అందులో ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. తనిఖీ చేసే సమయంలో వాహనంలో ముగ్గురు ఉండగా ఒకరు పరారు కాగా ఇద్దరు వ్యక్తులను, వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.

43 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

కాశేపల్లి టోల్ గేట్ వద్ద పట్టుబడిన ఐచర్ వాహనంలోని ఎర్రచందనం దుంగలు 43 ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అవి ఒక పాత ఇంటికి వాడినవని, వాటిని విక్రయించడానికా లేక ఏమిటనేది విచారణలో తెలియాల్సి ఉంది. అయితే పట్టుబడిన దుంగలు ఒక్కొక్కటి సుమారు 60 కేజీల నుంచి వంద కేజీల బరువు ఉన్నట్లు వీటి విలువ సుమారు రూ. 2కోట్ల మేరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న తాడిపత్రి డీఎస్పీ వీఎన్ కె చైతన్య పెద్ద వడుగూరు పోలీసులకు పట్టుబడిన ఎర్రచందనం దుంగలపై విచారణ చేపట్టారు.

Next Story