- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
AP:విజిలెన్స్ అధికారుల దాడులు..ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల స్వాధీనం
by Jakkula Mamatha |

X
దిశ ప్రతినిధి, అనంతపురం:గృహావసరాలకు వినియోగించాల్సిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న హోటళ్లపై సోమవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అనంతపురం ప్రాంతీయ నిఘా, అమలు అధికారి ఎం.ముని రామయ్య ఆదేశాల మేరకు అనంతపురం రూరల్ మండలంలోని ఆర్డీటీ స్టేడియం సమీపంలో మెయిన్ రోడ్డు పక్కన గల నేహా బిర్యానీ సెంటర్ పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన నాలుగు సిలిండర్లను సీజ్ చేశారు. ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న ఆ నాలుగు సిలిండర్లను రాప్తాడు సిఎస్డీటి జ్యోతికి అప్పగించారు. హోటల్ యజమాని పై కేసు నమోదు చేశారు. విజిలెన్స్ సీఐ వెంకటరమణ, డీసీటీఓ విజయలక్ష్మి, రాప్తాడు సీఎస్‌డీటీ జ్యోతి తదితరులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
Next Story